హైదరాబాద్ సిటీ : ప్రపంచ సోరియాసిస్ దినోత్సవం సందర్భంగా కేర్ ఆస్పత్రి ఔట్ పేషంట్ల విభాగంలో సోరియాసిస్ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి మీడియా కమ్యూనికేషన్స్ సీనియర్ మేనేజర్ శివశంకర్ తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్-10లోని ఓపీ విభాగంలో గురువారం ఉదయం 10 గంటల నురంచి సాయంత్రం 6 గంటల వరకు బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. పేర్ల నమోదు కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1800108666లో సంప్రందించాలని సూచించారు.




