వైఎంసీఏ: హైదరాబాద్ జిల్లా స్కూల్‌గేమ్స్ క్రికెట్ సెలెక్షన్స్ అండర్-14, 17 బాలబాలికలకు బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వేదికగా ఈ నెల 30 నుంచి నవంబర్ 2 వరకు నిర్వహిస్తున్నట్లు డీఈవో సోమిరెడ్డి తెలిపారు. జిల్లా డీఈవో పరిధిలోని ప్రతి పాఠశాల నుంచి ముగ్గురు చొప్పున క్రీడాకారులు సెలెక్షన్స్‌కు హాజరుకావాలన్నారు. 17 సంవత్సరాల వయసు గల బాలికలు ఈ నెల 30న, 14 ఏళ్ల బాలురు ఈ నెల 31న, 17 సంవత్సరాల బాలురు నవంబర్ 2న సెలెక్షన్స్‌లో పాల్గొనవచ్చు. వివరాలకు 80087 65509 నెంబర్‌లో సంప్రదించాలి.




