బంజారాహిల్స్: మిస్డ్ కాల్ వారిద్దరి పరిచయానికి దారితీసింది. అది కాస్త ప్రే మగా మారింది. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకొని సహజీవనం మొదలు పెట్టారు. చివరకు యువతిని గర్భవతిని చేసిన ప్రేమికుడు పెళ్లికి నిరాకరించడంతో బం జారాహిల్స్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. రహ్మత్‌నగర్‌కు చెందిన వి.చిన్న ఈ శ్వర్ రహ్మత్‌నగర్‌లో నివాసముంటున్నాడు. బంజారాహిల్స్ రోడ్డు నెం:1లో ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. శ్రీరాంనగర్‌కు చెందిన ఓ యువతి ప్రైవేటు సంస్థలో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తుంది. సంవత్సరం కిత్రం ఓ మిస్డ్ కాల్ ఇద్దరి మ ధ్య పరిచయం పెంచింది. కొద్ది రోజులు ఫోన్‌లో కబుర్లు చెప్పుకున్నారు. అనంతరం పార్కులు వెంట తిరుగుతూ ప్రేమించుకున్నారు. తనను వివాహం చేసుకోవాలని ఈశ్వర్‌ను కోరింది. కొద్ది కాలం పోయాక చేసుకుంటానని చెప్పాడు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. వివాహానికి ఈశ్వర్‌పై బాధితురాలు ఒత్తిడి తేవడంతో అతను ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ఈశ్వర్‌ను అరెస్టు చేశారు.




