కేసిఆర్‌ది రియల్ ఎస్టేట్ వ్యాపారం: సిపిఐ
హైదరాబాద్, జనంసాక్షి: టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వ్యవహారం రియల్ ఎస్టేట్ వ్యాపారం తరహాలో ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. సమ్మకమైన గిత్తలు ఇంట్లో ఉంటే అరువు ఆంబోతులను తెచ్చుకుంటున్నారన్నారు. ఆత్మబలిదానాలు చేసిన కుటుంబాలు ఉండగా ఇతర పార్టీల నేతలు అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ఆలోచన తెలంగాణ ఉద్యమ ఐక్యతను విచ్చిన్నం చేసేదిగా ఉందని విమర్శించారు. 2009 లో ఇచ్చిన హామీ బిల్లులు పెంచే అర్హత ఈ ప్రభుత్వానికి లేదన్నారు.