హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నివాసం బిజీబిజీగా మారింది. ఇవాళ ఉదయం నుంచి పలువురు తెలంగాణ నేతలు కేసీఆర్‌తో సమావేశమవుతున్నారు. ఇవాళ సాయంత్రం జేఏసీ నేతలు కోదండరామ్, శ్రీనివాస్‌గౌడ్‌లు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ ఉద్యమవ తాజా పరిస్థితులు, ఉత్తర తెలంగాణ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలపై వీరు చర్చించే అవకశమున్నట్లు సమాచారం. అంతకు ముందే తెలంగాణ కాంగ్రెస్ నేత కె. కేశవరావు కేసీఆర్ భేటీ అయి ఉద్యమ కార్యచరణ గురించి చర్చించారు.




