హైదరాబాద్,(జనంసాక్షి): టీఆర్‌ఎస్ అధ&క్ష్మీక్షుడు కె. చంద్రశేకర రావుపై ఎమ్మెల్యే పొంగులేటి సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణపై పేటెంట్ టీఆర్‌ఎస్‌దే అన్నట్లు కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బంద్ పిలుపును జేఏసీ భాగస్వామ్యపక్షాలే తప్పుపట్టడం అందుకు నిదర్శనం అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో దిష్టిబొమ్మను తగులబెట్టడం శాసనసభకే అవమానం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు కొందరు సీఎం తీరును తప్పుపట్టడం సరికాదన్నారు. తెలంగాణ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇచ్చేందుకు హైకమాండ్ కసరత్తు చేస్తోందని చెప్పారు.




