హైదరాబాద్: ఎన్నికల ముందు కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారని.. అవేమీ అచరణకు నోచుకోవట్లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే షబ్బీర్ అలీ ఆరోపించారు. అంతేకాకుండా తాను పంపిన ఫర్మానాకు సమాధానం కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. తెలంగాణలో ఇంకో రెండేళ్ల గడిచినా పూర్తిస్థాయి విద్యుత్ వచ్చే అవకాశం లేదని చెప్పారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధి వల్లే సీఎం అయిన విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని షబ్బీర్‌అలీ సూచించారు. కేసీఆర్‌పై ఫిర్యాదు చేసేందుకు వెబ్‌సైట్ www.facebook.com/kcr fake pramises ను ఉపయోగించుకోవాలని ఆయన తెలిపారు.




