న్యూఢిల్లీ: ముంబయి దాడుల ప్రధాన సూత్రధారి జకీ ఉర్ లఖ్వీ విడుదల అంశంపై భారత్ పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌కు సమన్లు జారీ చేసింది. ఈ మేరకు భారత విదేశాంగకార్యదర్శి అనిల్ వాద్వా సమన్లు పంపారు. ఈ విషయమై వాద్వా మీడియాతో మాట్లాడుతూ లఖ్వీ బెయిల్ పొంది ఉండవచ్చు కానీ విచారణ కొనసాగుతుందని అన్నారు. ముంబయి పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు లఖ్వీ విడుదలకు ఇవాళ ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.




