హైదరాబాద్,(జనంసాక్షి):టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఎంపీ విజయశాంతి, ఎమ్మెల్యే హరీష్‌రావుపై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషణ్ పిటిషనర్ బాలాజీవదేరా ఉపసంహరించుకున్నారు. ఆధారం లేకుండా వేసే పిటిషన్లను స్వీకరించేది లేదని జస్టిస్ కళ్యాణ్‌రాం సేన్‌గుప్తా నేతృత్వంలో ధర్మాసనం తేల్చిచెప్పింది. కేసు ఉపసంహరించుకుంటరా.. లేక జరిమానా వేయమంటరా .. అని పిటిషనర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు ఆగ్రహం బాలాజీవదేరా పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. బాలజీవదేరా అనంతపూర్‌కు చెందిన వ్యక్తి.




