హైదరాబాద్ : హైదరాబాద్ ఏఎస్‌రావునగర్‌లోని నారాయణ ఈ-టెక్నో స్కూల్లో అధిక ఫీజులను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. విద్యాహక్కు చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలని, ఫీజులను తగ్గించి విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించాలని ఎస్‌ఎఫ్‌ఐ, టీఆర్‌ఎస్‌వి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. అధిక ఫీజులు తగ్గించేవరకు పోరాడతామన్నారు. పాఠశాల ఎదుట బైఠాయించి నారాయణ విద్యా సంస్థలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.




