Tuesday, 3 November 2026

త్రీ డీలో ‘షోలే’ సినిమా

ముంబయి : 1975 నాటి సూపర్‌హిట్‌ సినిమా షోలే ఇక త్రీడీలో కనువిందు చేయనుంది. అలనాటి ఈ చిత్రం గొప్పదనం ఈ తరం ప్రేక్షకులకు తెలిసేలా 150 మంది టెక్నీషియన్లు దాదాపు ఏడాదికి పైగా కష్టపడి త్రీ డీ వర్షన్‌ రూపొందించినట్లు సమాచారం. అమితాబ్‌, ధర్మేంద్రలకు దీన్ని ప్రత్యేకంగా చూపించనున్నారు. చిత్రం పోస్టర్‌ డిజైన్‌ కూడా కొత్తగా రూపొందిస్తున్నారు. చిత్ర హీరోలిద్దరూ తమ బైక్‌ మీద త్రీడీ కళ్లద్దాలు పెట్టుకుని కన్పించబోతున్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *