Wednesday, 4 November 2026

కేసీఆర్‌ అధికారం శాశ్వతం కాదు – కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, (మార్చి 4): అధికారం శాశ్వతం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుర్తుంచుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి హెచ్చరించారు. విద్యార్ధులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ నిధులు వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేసారు. లేనిపక్షంలో తాను ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు. కేసీఆర్‌ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని అందువల్లే బీజేపీ ఎమ్మెల్యేలు రేపు ఇందిరాపార్క్‌ వద్ద దీక్ష చేస్తున్నామని ఆయన ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *