Wednesday, 4 November 2026

98 హామీలు ఏమయ్యాయి? – షబ్బీర్‌అలీ

హైదరాబాద్‌, (మార్చి 4) : ముఖ్యమంత్రి కేసీఆర్‌ గడిచిన 8 నెలల్లో 101 హామీలిచ్చి మూడు మాత్రమే నెరవేర్చారు. మరి మిగిలిన 98 హామీలు ఏమయ్యాయని కాంగ్రెస్‌ మాజీమంత్రి, ఎమ్మెల్యే షబ్బీర్‌ అలీ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన ఇవాళ ఘాటుగా లేఖ రాశారు. కేసీఆర్‌ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన లేఖలో విమర్శించారు. ఇప్పటి వరకూ 108 హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి కేవలం మూడు హామీలను మాత్రమే నెరవేర్చారని ఆయన పేర్కొన్నారు. మరో 8 హామీలను పాక్షికంగా నెరవేర్చారని, మిగిలిన హామీల మాట మర్చిపోయారని షబ్బీర్‌అలీ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో పేద ప్రజలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళు ఉచితంగా కట్టిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్‌ ఇప్పుడు కేవలం బహుళ అంతస్తుల నిర్మాణాలపైనే దృష్టి పెడుతున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ నేతలు ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన లేఖలో ఆరోపించారు. కేసీఆర్‌ తనకు తాను రాజు అనుకుంటున్నాడని, అందువల్లే ఆయనకు లేఖ పంపుతున్నానని షబ్బీర్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *