కేసీఆర్ జమానా`అవినీతి ఖజానా
ప్రగతి భవన్ అవినీతి భవన్‌గ మారిందంటూ లేఖ
బండి వ్యాఖ్యలపై మండపడ్డ బాల్క సుమన్
సిద్దిపేట,సెప్టెంబర్28(జనం సాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. ఆ లేఖలో పది ప్రశ్నలు సంధించారు. కేసీఆర్ జమానా`అవినీతి ఖజానా..అని సకల జనులు ఘోషిస్తున్నారని అన్నారు. ప్రగతి భవన్.. అవినీతి భవన్‌గా మారిందన్నది వాస్తవం కాదా? అని
ప్రశ్నించారు. దేశంలో అత్యంత అవినీతిపరుడు సీఎం కేసీఆర్ అనే పేరుందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించి తన నిజాయితీ నిరూపించుకుంటారా? అన్నారు. కేసీఆర్ ఆస్తులు లక్ష రెట్లు పెరిగిన మాట నిజం కాదా?.. దీనిపై చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ చేశారు. కాళేశ్వరం రీడిజైన్ పేరుతో ప్రజా ధనాన్ని కొల్లగొట్టారా? లేదా? అన్నది స్పష్టం చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ పై ఎమ్మెª`యే బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. బిజెపికి బండి సంజయ్ గుదిబండల తయారయ్యారని అన్నారు. బండి సంజయ్ పాదయాత్రకు స్పందన లేదని ఎద్దవా చేశారు. బురదలో పొర్లే పందికి పన్నీర్ వాసన తెలియనట్లే బండి సంజయ్ కి ప్రగతి భవన్ గురించి తెలియదన్నారు. ప్రగతి భవన్ సబ్బండ వర్గాల సంక్షేమ భవన్ అని,నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అభిమానం కేసీఆర్ కు వెలకట్టలేని ఆస్తి అని స్పష్టం చేశారు. ఇది సన్నాసి బండి సంజయ్‌కు తెలియదని చురకలు అంటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సక్కగా ఉందని బండి సంజయ్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చిందని గుర్తు చేశారు. వినాయక నిమజ్జనం ముగిసింది. ఇక ప్రతిపక్షాల నిమజ్జనం మిగిలి ఉందని..ఆ బాధ్యత ప్రజలు తీసుకుంటారన్నారు. సదువు రాని సన్నాసి బండి సంజయ్ కు ఏమి చెప్పినా అర్థం కాదని ఎద్దేవా చేశారు. మోడీ అప్పులు చేస్తూ రికార్డు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు.