Thursday, 5 November 2026

కేసీఆర్ అందరివాడు అశోక్ పటేల్

 

 

 

 

బిచ్కుంద ఏప్రిల్ 17 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని గుండెకల్లూర్ గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఎంపీపీ అశోక్ పటేల్ కళ్యాణ లక్ష్మీ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గిందని తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ప‌థ‌కాల‌ను ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెరాస పార్టీ అధ్యక్షుడు వెంకటరావు దేశాయ్, సర్పంచ్ సంగీత, మాజీ సర్పంచ్ సాయిగొండ, సురేష్, సిద్ధిరాం పటేల్, గోపన్పల్లి సర్పంచ్ కొట్టే రాములు మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.