సైదాపూర్ జనం సాక్షి ఏప్రిల్17మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి సోమవారం పరామర్శించారు. ఇటీవల అనారోగ్య కారణాలతో గ్రామానికి చెందిన అందే కమల,కనకం లింగయ్య, మూల సాయి రెడ్డి లు మృతి చెందారు. వారి కుటుంబాలను కలిసి ఓదార్చారు.ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసి వారి కుటుంబాలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. అలాగే ఇటీవల కరీంనగర్లో విధులు నిర్వర్తిస్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ హోంగార్డ్ మ్యాదరి రాజయ్యను ఓదార్చారు. ప్రమాదం జరిగిన సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాయిత రాములు, వార్డు సభ్యులు రేగుల సురేష్ ,మాతంగి వెంకటయ్య ,టిఆర్ఎస్ పార్టీ నాయకులు నాంపల్లి భూపతి, మ్యాకల మల్లారెడ్డి, కిటకిట రాజు తదితరులు ఉన్నారు.




