Tuesday, 3 November 2026

కేసీఆర్ అప్పుడు ఎగతాళి చేయడం వల్లే నీటి కష్టాలు: ఎర్రబెల్లి

హైదరాబాద్, ఆగస్టు 28 : మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై బాబ్లీ ప్రాజెక్టును నిర్మించడం ప్రారంభించిన సమయంలోనే తాము దానిని వ్యతిరేకించామని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… బాబ్లీ ప్రాజెక్టును తాము వ్యతిరేకించినప్పు మంత్రిగా ఉన్న కేసీఆర్ 2 టీఎంసీల కోసం రాద్ధాంతం ఎందుకని తమను ఎగతాళి చేసి మాట్లారని ఎర్రబెల్లి దయాకర్‌రావు  గుర్తుచేశారు.  ప్రస్తుతం గోదావరికి నీరు సమృద్దిగా రాకపోవడానికి సీఎం కేసీఆరే కారణమన్నారు. ఆనాడు కేసీఆర్ కూడా తమతో పాటు వ్యతిరేకించి ఉంటే..  ప్రస్తుతం పరిస్థితి ఇంతవరకు వచ్చేదికాదన్నారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తామని తమ మిత్రపక్షమైన బీజేపీకి చెప్పామని, ఆదివారం బీజేపీ ముఖ్య నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎర్రబెల్లి ఈ సందర్భంగా చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *