హైదరాబాద్, ఆగస్టు 28 : సనత్‌నగర్ జెక్‌కాలనీలో ఎకరం భూమిని ఆక్రమించుకోవాలని కాలనీ వాసులను మంత్రి తలసాని ఉసిగొల్సడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… వక్ఫ్ భూములను ఆక్రమించుకోవాలని చెబుతున్నారని, ఓపెన్ టెండర్ ద్వారా లీజుకివ్వొచ్చని అధికారులు చెబుతుంటే మంత్రి తలసాని మాత్రం కబ్జా చేయాలని చెబుతున్నారని ఆయనన్నారు. అలాగే…. ఎన్నికల ప్రచారంలో మైనార్టీలకు సీఎం ఎన్నో వాగ్దానాలిచ్చారని, వక్ఫ్ భూములను కాపాడుతామని హామీ ఇచ్చారని, అయితే మంత్రి తలసాని మాత్రం భూముల ఆక్రమణను ప్రొత్సహిస్తున్నందున ఆయనపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు




