Friday, 6 November 2026

కేసీఆర్ కు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వికలాంగులు. పాల్గొన్న కార్పొరేటర్ ముద్దంనరసింహ యాదవ్.

 

కంటోన్మెంట్ జనం సాక్షి జూన్ 12 ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ పరిధిలో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం వికలాంగులకు పింఛన్ల ను పెంచడంపట్ల హర్షం వ్యక్తం చేస్తూ 3116 రూపాయలుగా ఉన్న పెన్షన్ మరో వెయ్యి రూపాయలు పెంచినందుకు ఆ మొత్తంను 4116 రూపాయలు చేయడం సంతోషకరమన్ని దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు, చిత్రపటానికి ఓల్డ్ బోయినపల్లి119 డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహయాదవ్ పాలాభిషేకం చేసి కృతజ్ఞతలుతెలియజేస్తూ టపాకాయలు పేల్చిసంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో దివ్యాంగులకు ప్రస్తుతం ప్రతి నెల ఇస్తున్న 3116 రూపాయల పెన్షన్ ను మరో వెయ్యి రూపాయలు పెంచడం గొప్ప నిర్ణయం,
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం వికలాంగులకు నాలుగు వేల 116 రూపాయల పెన్షన్లు అందిస్తుందని,అయితే వచ్చే నెల నుంచి ప్రతీ దివ్యంగులకు 4116 రూపాయలు చెల్లించడం జరుగతుందన్నారు,అభివృద్ధి సంక్షేమ పథకాలలో తెలంగాణ రాష్ట్రం ముందంజ లో ఉందని,తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు,పెన్షన్లు ఏ రాష్ట్రంలో కూడా ఇంత అద్భుతంగా అమలు కావడంలేదన్నారు.దివ్యాంగులు అందరితో సమానంగా ఎదగాలి అన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్ని అన్నారు.ఈ సందర్భంగా వికలాంగురాలు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ శారీరక వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసాను కల్పించిందని తెలియజేశారు.అనంతరం నాగేశ్వరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక చేయూతను తాము విస్మరించబోమని,దివ్యాంగులకు,పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నలగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో
బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డివిజన్ జనరల్ సెక్రెటరీ మేకలహరినాథ్, నరేంద్ర గౌడ్,కర్రె జంగయ్య, ఇజాజ్,మన్నె ఉదయ్ యాదవ్, గడ్డం నర్సింగ్ రావు,ఎస్సీ సెల్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి,బీసీ సెల్ అధ్యక్షుడు మట్టి శ్రీనివాస్,మైనార్టీ సెల్ అధ్యక్షుడు జాంగిర్,ఎస్టీ సెల్ అధ్యక్షుడు కమల్,ఖదీర్,రాజు యాదవ్, చందు యాదవ్,కార్తీక్, చారి, పోచయ్య,గణేష్, ఉదయ్, బాలరాజ్,జెకె,శివ,ప్రశాంత్, ప్రవీణ్, గణేష్, కుమార్,అరుణ్,శశికళ, సంతోషి,ఉమా,రోజా,దేవి,సుమా,పద్మలత,పద్మ,ఉమ,అనురాధ,కమల మరియు సీనియర్ నాయకులు కార్యకర్తలు,వికలాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.