సర్పంచ్ నీల కుమార స్వామివీణవంక జూన్ 12 (జనం సాక్షి) వీణవంక మండల కేంద్రానికి చెందిన గంట కొమురయ్య అనారోగ్యంతో మృతి చెందగా స్థానిక సర్పంచ్ నీల కుమారస్వామి మృతుని పార్థివ దేహం వద్ద నివాళులర్పించి మృతి గల కారణాలు వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు 3000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఇటీవల మృతి చెందిన గంట కనకయ్య కుటుంబ సభ్యులకు 3000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. . వీరి వెంట నాయకులు తాళ్ల పెళ్లి మహేష్ గౌడ్, నీల లక్ష్మి , గొడుగు రాజు, నాయకులు శ్రీనివాస్, క్రాంతి, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు
మృతి చెందిన పలు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన




