కే ఓసి లో ఘనంగా సింగరేణి దినోత్సవ వేడుకలు
టేకులపల్లి, డిసెంబర్ 23( జనం సాక్షి ): ఇల్లందు ఏరియాలోని కోయగూడెం ఉపరితల గని ప్రాజెక్టు కార్యాలయంలో శుక్రవారం ఘనంగా సింగరేణి దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. కే ఓ సి ప్రాజెక్టు అధికారి ఎన్ వి ఆర్ ప్రహ్లాద్ సింగరేణి జెండాను ప్రాజెక్టు కార్యాలయం ముందు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ఆవిర్భావం, వివిధ అభివృద్ధి దశలు, ప్రస్తుత పరిస్థితులు, ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా, రక్షణ పరంగా సింగరేణి సాధించిన అభివృద్ధిని ఉద్యోగులకు వివరించారు. అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేయాలని, రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని ఉద్యోగులకు, కాంట్రాక్టు కార్మికులకు తెలుపుతూ సింగరేణి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ సౌరబ్ సుమన్, డిప్యూటీ మేనేజర్ ఈ రవికుమార్, ఇంజనీరు నాగశేషు,ఫిట్ సెక్రటరీ ఆర్ అశోక్ కుమార్, సీనియర్ పర్సనల్ అధికారి పసునూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.




