Sunday, 8 November 2026

రైతులు ఆధునిక పద్ధతులను ఉపయోగించుకోవాలి

రైతులు ఆధునిక పద్ధతులను ఉపయోగించుకోవాలి.
నెరడిగొండ డిసెంబర్24(జనంసాక్షి):దేశ్ పాండే ఫౌండేషన్ బిసిఐ ప్రోజెక్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున జాతీయ రైతుల దినోత్సవాన్ని ఐఎన్టిఎల్ -32 ఆధ్వర్యంలో మండలంలోని గోండుగుడా గ్రామంలో రైతుల సమక్షంలో ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించారు. జాతీయ రైతు దినోత్సవం యొక్క ప్రాముఖ్యత కొత్త టెక్నాలజీని ఉపయోంచి వ్యవసాయం చేయడం గురించి వ్యవసాయ క్షేత్రంలో చేసుకోవాల్సిన ముఖ్యమైన పనుల గురించి వివరంగా చెప్పడం జరిగింది.అలాగే దేశ్పాండే ఫౌండేషన్ బిసిఐ ప్రోజెక్ట్ వారు చెప్పిన ఉత్తమ పద్ధతులు పాటించి మంచి మార్గంలో నడుస్తున్న ఉత్తమ ఎక్స్పీరియన్స్ రైతులతో మాట్లాడించడం జరిగింది. ఉత్తమ రైతుగా ఎంపిక చేసి వారికి మేమొంటోస్ ఇవ్వడం జరిగింది.వారి యొక్క అనుభవాలను మిగతా రైతులతో పంచుకున్నారు. దేశ్పాండే ఫౌండేషన్ ద్వారా బిసిఐ వాళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు వాల్లు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.రైతులకు సంబంధించిన ఆక్టివిటీ చేయించారు.ఈ కార్యక్రమంలో పియూ మేనేజర్ వంశీ సార్ ఎఫ్ఎఫ్ ఎస్ ఇందల్ జాదవ్ మోతిరామ్ జాదవ్ సాయి శ్రీనివాస్ రవీందర్ నిఖిల్ స్వప్న రాజు మహేష్ పృథ్వీ గ్రామ పెద్దలు లీడ్ ఫార్మర్ బీసీఐ ఫార్మర్ వర్కర్స్ పాల్గొన్నారు