హైదరాబాద్: కే4 పాలనలో తెలంగాణ రాష్ట్రం నలిగిపోతోందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి రాష్ర్టాన్ని కాపాడుకుంటామన్నారు. సాగర్ వివాదంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేషజాలకు పోకుండా సమస్య పరిష్కారానికి కృషి చేశారన్నారు. చత్తీస్‌గఢ్ నుంచి కృష్ణపట్నం, హిందూజాలో తెలంగాణకు అన్యాయం జరిగితే తామే పోరాటానికి దిగుతామని తెలిపారు. మంత్రి జగదీశ్‌రెడ్డిపై వస్తున్న ఆరోపణలకు సీఎం కేసీఆర్ స్పందించడం లేదని రమణ అన్నారు.




