హైదరాబాద్: బ్యాంకు అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఖాతాదారులు ఎంత అప్రమత్తంగా ఉంటున్నా బ్యాంకులో దొంగతనాలు ఆగడం లేదు. అడుగడుగునా సీసీ కెమెరాలు అమరుస్తున్నా దొంగల చేతివాటాన్ని అడ్డుకోలేకపోతున్నాయి. తాజాగా మల్కాజ్‌గిరి ఆనంద్‌భవన్ స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా శాఖలో ఓ ఖాతాదారుడి దృష్టి మరల్చిన దొంగ అతడి వద్దనున్న రూ.75వేలను చాకచక్యంగా దోచుకుని ఎంచక్కా చెక్కేశాడు. తర్వాత తీరిగ్గా గమనించిన ఖాతాదారుడు డబ్బులు చోరీకి గురయ్యాయని తెలిసి లబోదిబోమన్నాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.




