కొండమల్లేపల్లి ఎస్ ఐ నారాయణరెడ్డి ఎంపీడీవో బాలరాజు రెడ్డి లకు ఆంజనేయ స్వాముల ఘన సన్మానం కొండమల్లేపల్లి డిసెంబర్ 5 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలో సోమవారం నాడు ఆంబోతు గ్రామపంచాయతీ లో గ్రామ సర్పంచ్ ఆంబోతు పవన్ మరియు ఆంజనేయులు స్వాముల సమక్షంలో కొండమల్లేపల్లి ఎస్ ఐ నారాయణరెడ్డి, ఎంపీడీవో బాలరాజు రెడ్డి మరియు పిఆర్ఏఈ ధర్మేంద్ర లకు ఆంజనేయస్వామి దేవాలయంలో ఘనంగా శాలువా పూలమాలలతో సన్మానం చేశారు అనంతరం హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కొండమల్లేపల్లి ఎస్ ఐ నారాయణరెడ్డి ఎంపీడీవో బాలరాజు రెడ్డి మాట్లాడుతూ హనుమాన్ కృపతో సంకల్ప దీక్ష నెరవేరాలని ఆంజనేయ స్వామి అనుగ్రహంతో అన్నింటి శుభం కలగాలని హనుమాన్ కృపతో హనుమాన్ స్వాములు చేసిన దీక్ష ఫలించాలని వారు కోరుకునే సంకల్పం నెరవేరాలని ఆంజనేయ స్వామి కృపతో అందరికీ అన్నింటి శుభం కలగాలని ఆంజనేయ స్వామి మాల దీక్ష స్వాములు ప్రజల కొరకు చేసే ప్రతి కార్యక్రమం స్వామి ఆశీస్సులతో ఫలప్రదం కావాలని కోరుకుంటూ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు బాగుండాలని వారు ఆంజనేయ స్వామిని వేడుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో పి ఆర్ ఏ ఈ ధర్మేంద్ర,ఆంబోతు తండా గ్రామ సర్పంచ్ ఆంబోతు పవన్, ఉప సర్పంచ్ బిక్యా, ఎంపీటీసీ జగన్ నాయక్, మంగ్యా, రతన్, రామస్వామి, రవి స్వామి, పంతు స్వామి, చిన్న స్వామి, మోహన్ స్వామి, లక్ష్మణ్ స్వామి, శంకర్ స్వామి, సుమన్ స్వామి, జబ్బర్ స్వామి, తర్యా స్వామి మరియు ఆంజనేయ స్వామి భక్తులు గ్రామస్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
కొండమల్లేపల్లి ఎస్ ఐ నారాయణరెడ్డి ఎంపీడీవో




