గురువును సన్మానించిన శిష్యుడు
బిచ్కుంద డిసెంబర్ 05 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో గతంలో ప్రఖ్యాతి గాంచిన ఎస్ వీ ఎన్ పాఠశాల ప్రిన్సిపాల్ రాజయ్య గుప్తాకి ఆయన శిష్యుడు డాక్టర్ రహీం ఖాన్ సోమవారం నాడు తన దవాఖానలో శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజయ్య గుప్తా మాట్లాడుతూ తన అధ్వర్యంలో శిక్షణ పొందిన విద్యార్థులకు సబ్జెక్టుతో పాటు సామాజిక సేవలు కూడా బోధించానని పేర్కొన్నారు. తన శిష్యులు మరియు తన పాఠశాలలో నేర్పొందిన అనేక మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరారని హర్షం వ్యక్తం చేశారు.
గురువును సన్మానించిన శిష్యుడు




