Saturday, 7 November 2026

కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి

కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి కొండమల్లేపల్లి నవంబర్ 28 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలో సోమవారం నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు కర్నాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహుజన బ్రతుకుల్లో వెలుగులు నింపిన ధీరుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దీన జన బాంధవుడు సమ సమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన మహాత్మ జ్యోతిరావు పూలే అని విద్య లేనిదే వికాసం లేదు, వికాసం లేనిది పురోగతి లేదు, పురోగతి లేనిదే ప్రగతి లేదు, ప్రగతి లేకనే శూద్రులు, అతిశూద్రులు అధోగదిపాలయ్యారని మనిషిని మహోన్నతుడుగా తీర్చిదిద్దేది విద్య ఒక్కటే అని సామాజిక తత్వవేత్త, సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆ దార్షనికుడికి ఘనంగా నివాళులు అర్పిస్తూ అధ్యాప బృందం మరియు విద్యార్థినీ విద్యార్థులతో కలిసి వారి చిత్రపటానికి పూలమాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో కొర్ర లోక్యా నాయక్, చంద్రయ్య, సముద్రాల శ్రీనయ్య, జనార్దన్ రెడ్డి, శ్రీపతి రావు, సూర్య, జగదీష్, సైదా నాయక్, లింగారెడ్డి, ఇద్దయ్య, నాగేంద్రమ్మ, నీరజ,కళమ్మ, సరస్వతి, సౌజన్య, మంజుల, కవిత, రమాదేవి,నిర్మల, సీతారాం, నరసింహ, చారి,నరసింహారావు, నాగరాజు, గిరి, శ్రీనయ్య మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు