Saturday, 7 November 2026

ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం

ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం*
మెట్పల్లి టౌన్, నంబర్ 28,
జనం సాక్షి:
మెట్ పల్లి పట్టణ కేంద్రంలో ని లక్ష్మి నరసింహా స్వామి ఆలయంలో సోమవారం రోజున లక్ష్మీనరసింహస్వామి కళ్యాణము మహోత్సవం అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా,చూడ ముచ్చటగా,ఘనంగా జరిగింది, పర్రె వంశం వారి ఆధ్వర్యంలో వేద పురోహితులు శేషాద్రి చారి వేదమంత్రాలతో కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం, యజ్ఞ హోమ కార్యక్రమాలు ఘనంగా జరిగినవి, ఈ సందర్భంగా
ఆలయ కమిటీ పర్రె శంకర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పర్రె వారి కుటుంబ సభ్యులు సొంతంగా లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణము, హోమము జరిపించడం ఆనవాయితీగా వస్తుందని , అన్నదాత లక్కంపల్లి అశోక్ సొంతంగా అన్నదానం చేశారని అన్నారు
ఈ కార్యక్రమంలో లక్ష్మీ నరసింహ ఆలయ పర్రె కమిటీ నిర్వాహకులు పర్రె శంకర్, అన్నదాత లక్కంపల్లి అశోక్, పర్రెచిన్నయ్య, పర్రెరాజయ్య,పర్రె మోహన్, చింత కింది సురేషు, రమేషు, పర్మి నరసయ్య, జాయినింగ్ బార్ శంకర్ , చంద్రపాల్, లింగయ్య, రంజిత్ ,గంగాధర్,
పర్రె వంశ సభ్యులు భక్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు