కొండమల్లేపల్లి జనవరి 28 (జనంసాక్షి) న్యూస్ :
కొండమల్లేపల్లి మండల కేంద్రంలో శనివారం నాడు ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ లో స్నాక్స్ ఏర్పాటు చేయాలని మా దృష్టికి వచ్చిందని జడ్పీహెచ్ఎస్ స్కూల్ లో చదువుతున్న విద్యార్థుల కోసం గతంలో కూడా ఎన్నో సహాయ సహకారాలు అందించామని అకస్మాత్తుగా కరోనా రావడం వల్ల లాక్డౌన్ సమస్యల వల్ల జడ్.పి.హెచ్.ఎస్ విద్యార్థులకు అందించే స్నాక్స్ ఆపేశామని ఇప్పుడు విద్యార్థులు అడుగుతున్నారు కాబట్టి వార్షిక పరీక్షల సమయం రాబోతున్నందున మళ్లీ పాత పద్ధతిలోనే స్నాక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు సోమవారం నుండి ఏర్పాటు చేద్దామని హామీ ఇచ్చారు నల్లగొండ జిల్లాలోని నెంబర్ వన్ పాఠశాల కొండమల్లేపల్లి జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల అని గ్రామీణ ప్రాంతం నుండి వచ్చే విద్యార్థులు ఎక్కువగా ఉన్నారని ఉపాధ్యాయ బృందాలు వారిపై ఎక్కువ శ్రద్ధ పెట్టి మంచి ఉత్తీర్ణత శాతం సాధించాలని మట్టిలో మాణిక్యం లాగా గ్రామీణ విద్యార్థులలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి వారికి వార్షిక పరీక్షలతో పాటు సమాజానికి దేశ రక్షణ కి ఉపయోగపడేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా మాతో సంప్రదించాలని కోరారు మరియు వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గతంలో విద్యార్థులకు స్నాక్స్ అందించడం జరిగిందని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు తమ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారిని సంప్రదించగా విద్యార్థులకు స్నాక్స్ విషయమై యంపిపి దృష్టికి తీసుకు వెళ్లలేదని అన్నారు. గతంలో మా విద్యార్థులకు స్టడీ అవర్ సమయంలో స్నాక్స్ అందించిన ఘనత ఎంపీపీ దేనని అన్నారు. మా పాఠశాలలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మండల సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న ఎంపీపీ తన సొంత డబ్బులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఇంకా చేస్తామని హామీ ఇస్తున్నారు పార్టీలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇటీవలనే మన మన అందరి కార్యాలయం ప్రారంభించారు అడిగినవే కాకుండా అడగకుండానే మండల పరిధిలోని పాఠశాలలో ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారు. అధికార పార్టీ కాకపోయినా నిధులు రాకపోయినా మా ఎంపీపీ తన సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం పై ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు వెల్లువెత్తున అభినందనలు తెలుపుతున్నారని తెలిపారు




