Wednesday, 4 November 2026

కొండమల్లేపల్లి నూతన ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన వీరబాబు

 

 

 

 

 

 

 

 

కొండమల్లేపల్లి ఫిబ్రవరి 8 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి పోలీసు స్టేషన్ నూతన ఎస్ఐ గా వీరబాబు బుధవారం ఉదయం స్థానిక పోలీసు స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించారు ఇక్కడ ఎస్ఐ గా పనిచేసిన నారాయణరెడ్డి బదిలీపై నల్లగొండకు వెళ్లారు నూతన ఎస్ఐ వీరబాబు గతంలో గుడిపల్లి ఎస్ఐ గా పనిచేశారు అనంతరం బదిలీ పై కొండమల్లేపల్లి ఎస్ఐ గా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా స్టేషన్ సిబ్బంది, పలువురు ప్రముఖులు వీరబాబు కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన ఎస్ఐ వీరబాబు మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, శాంతి భద్రతలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని, అందుకు సహకరించాలని ప్రజలను కోరారు. అలాగే అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.