*గ్రీన్ ఫీల్డ్ హై వే రైతుల నిరసన*ఇదేమని అడిగితే రైతుల ను పోలీస్ స్టేషన్ కు పిలిపిస్తున్నారుపెనుబల్లి, ఫిబ్రవరి 8(జనం సాక్షి)పోయిన భూములకు నష్టపరిహారం చెల్లించకుండా పనులు ఎలా చేస్తారంటూ బుదవారం గ్రీన్ ఫీ ల్డ్ హై వే రైతులు తమ భూమి వద్ద నిరసన వ్యక్తం చేసారు, ఇదేమని రైతులు అడిగినందుకు హైవే సంభందిత అదికారులు,రైతుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తూ, బెదిరింపు చర్యలకు పాల్బడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం సీతారామ పురం వద్ద సర్వే నెంబర్ 59,81 లో ఉన్న 12.33 ఎకరాలలో గ్రీన్ ఫీల్డ్ హై వే నిర్మాణం లో భూమి మధ్యలో నుండి 4 ఎకరాల 77 సెంట్లు రైతులు కోల్పోతున్నా మన్నారు. ఐతే ఇందులో భూమి తో పాటు 100 కు పైగా వివిధ రకాల జాతుల చెట్లు, 4 గదుల ఇల్లు వ్యవసాయ మోటర్ వంటివి రైతులు నష్ట పోతు న్నా మన్నారు,అవేమి అవార్డు చేయకుండా కేవలం భూమికి 50 చెట్ల కు మాత్రమే నష్ట పరిహారం ఇచ్చి పనులు చేసేందుకు భూమిలోకి వస్తున్నారని, సర్వే చేసే సమయం లో రైతులను పిలవకుండా భూమిలో ఉన్న ఇతర వనరులకు అవార్డు చేయకుండా గ్రీన్ ఫీల్డ్ పనులు ఎలా చేస్తారంటూ నిరసన వ్యక్తం చేసారు. గ్రీన్ ఫీల్డ్ హై వే పనులు ప్రారంభించాక మేము కోల్పోయిన చెట్లు వనరులు ఎలా గుర్తించి అవార్డు చేస్తారని రెవిన్యూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. మా నష్ట పరిహారం గురించి అడిగితే పోలీస్ లకు పిర్యాదు చేసి స్టేషన్ కు పిలిపిస్తున్నారని భూములు కోల్పోయిన మేము పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి వస్తుందని వాపోయారు. రైతుల పట్ల గ్రీన్ ఫీల్డ్ హై వే అధికారుల అతి ఎక్కువైందని తగ్గించుకో పోతే రైతులు కన్నెర్ర చేస్తే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంద ని హెచ్చరించారు.




