Thursday, 5 November 2026

కొండమల్లేపల్లి నూతన సిఐ గా ఎస్ శ్రీనివాసులు బాధ్యతల స్వీకరణ

కొండమల్లేపల్లి మార్చి 12 జనంసాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి నూతన సిఐగా ఎస్ శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు నూతన సిఐ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్ శ్రీనివాసులు దేవరకొండ సర్కిల్ లో గత తొమ్మిది నెలలుగా విధులు నిర్వహించారు గతంలో కొండమల్లేపల్లి సిఐగా పనిచేసిన రవీందర్ రాచకొండ కమిషనరేట్ కు బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా కొండమల్లేపల్లి సిఐ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ శ్రీనివాసులు మాట్లాడుతూ స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధుల సహకారంతో ఫ్రెండ్లీ పోలీస్ గా వ్యవహరించి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు ప్రజల భాగస్వామ్యంతో శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడతానని తెలిపారు పోలీసులంటే ప్రజలతో స్నేహభావంతో మెలిగే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, గంజాయి, డ్రగ్స్, మట్కా, పేకాట, గుట్కా, అక్రమ మద్యం మొదలగు విషయాలలో కఠిన చర్యలు తీసుకుంటానని అక్రమాలకు, దొంగతనాలకు, ప్రజల స్వేచ్ఛకు హాని కలిగించే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అన్నారు భూమి, ప్లాట్ల, ఇండ్ల సమస్యలు ఏమైనా ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలని తెలిపారు అనంతరం నూతన సిఐగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ శ్రీనివాసులు కు కొండమల్లేపల్లి ఎస్ఐ వీరబాబు,గుడిపల్లి ఎస్ఐ మరియు గుర్రంపూడ్ ఎస్ఐ లు శుభాకాంక్షలు తెలిపారు