Thursday, 5 November 2026

కొండమల్లేపల్లి పట్టణంలో ధోబి ఘాట్ కోసం స్థల పరిశీలన చేసిన పసునూరు యుగేందర్ రెడ్డి

కొండమల్లేపల్లి జనవరి 20 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి పటానికి కేంద్రంలో శుక్రవారం నాడు జడ్పిటిసి సలహాదారు పసునూరు యుగేంధర్ రెడ్డి హైదరాబాద్ రోడ్ లోని డబుల్ బెడ్ రూమ్ ఏరియాలో ధోబి ఘాట్ కోసం స్థల పరిశీలన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక దుస్తులను ఉతికే ప్రదేశాన్ని సూచించడానికి ధోబి ఘాట్ అనే పదాన్ని మనదేశంలో అంతటా ఉపయోగిస్తారని మన ఏరియాలో లాండ్రీ ప్లేస్ లేదా వాషింగ్ ప్లేస్ ను సూచించడానికి దోబీ ఘాట్ అనే పదాన్ని ఉపయోగిస్తారని ఇక్కడ చాలామంది చాకలి వారు లేదా బట్టలు ఉతికే వాళ్ళు ఉంటారని బట్టలు మరియు ఇతర నార బట్టలు ఉతకడానికి స్థలాన్ని ఉపయోగిస్తారు సాధారణ వ్యక్తులు లేదా సాంప్రదాయకంగా పురుషులు కావచ్చు అని అటువంటి వారికోసం ధోభి ఘాట్ అవసరం ఉంటుందని తెలిపారు వారికోసం ఒక ధోబి ఘాట్ ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు ధోభి ఘాట్ పరిశీలనతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఏరియాలో ఉన్న ఇండ్ల నుండి మల్లెల గట్టుకి సీసీ రోడ్డు పరిశీలన చేశారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కొండమల్లేపల్లి ఎంపీటీసీ వస్కుల తిరుపతమ్మ కాశయ్య మరియు డబుల్ బెడ్ రూమ్ ఏరియా కాలనీవాసులు, పట్టణ యువకులు తదితరులు పాల్గొన్నారు