Thursday, 5 November 2026

కంటి వెలుగు పుణ్యంతో పారిశుధ్య పనులు

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ మండల పరిధిలోని నేరేడిగుంట గ్రామంలో శుక్రవారం
పల్లెలు ప్రకృతి పారిశుధ్యం ప్రగతి బాటలో కొనసాగించేందుకు గ్రామ నిర్వహణకు నిధులు మంజూరు అవుతున్న పారిశుధ్య లోపంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అందోల్ మండలంలోని నేరేడు గుంట గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు కరువు కాగా కంటి వెలుగు పుణ్యమా అంటూ రోడ్లను ఊడ్చే కార్యక్రమంలో సంబంధిత పంచాయతీ కార్యదర్శి శ్రద్ధ చూపాడు పిల్లి వచ్చే ఎలుక దాగే అన్న చందంగా గ్రామంలో లోపించిన పారిసిద్యాన్ని పై అధికారులు చూడకుండా గ్రామంలోకి ప్రవేశ దారిపై పరిశుద్ధ కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ శరత్ కంటి వెలుగు కార్యక్రమానికి వస్తున్నాడు అన్న సమాచారంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టినట్లు తెలుస్తుంది గ్రామంలో మాత్రం పరిశుద్ధ లోతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామంలో బహిరంగ మల విసర్జన , నిండిపోయిన మురికి కాలువలు, పారిశుధ్య లోపంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కంటి వెలుగు పుణ్యంతో ఈ కార్యక్రమాలు చేపట్టడంతో గ్రామ నిర్వాహన అధికారుల తీరుపై ప్రజలు వాపోతున్నారు.