Tuesday, 3 November 2026

కొండమల్లేపల్లి పట్టణంలో స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్

 

 

 

 

 

కొండమల్లేపల్లి జనవరి 29 (జనంసాక్షి) న్యూస్ :కొండమల్లేపల్లి జడ్పీటీసీ పసునూరు సరస్వతమ్మ బిఆర్ఎస్ కొండమల్లేపల్లి ప్రధాన కార్యదర్శి పసునూరు యుగేందర్ రెడ్డి వారి సౌజన్యంతో ఉదయం 11 గంటలకు స్థానిక మార్కెట్ యాడ్ నందు మెగా ఉచిత హెల్త్ క్యాంపు జెడ్పిటిసి సరస్వతమ్మ ప్రజా ప్రతినిధులతో ,అసోసియేషన్ సభ్యులతో , తనయుడు ఓసునూరు యుగేందర్ రెడ్డితో కలసి కార్యక్రమాన్ని ప్రారంభించారు, అనంతరం దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ వి టి మాట్లాడుతూ, కొండమల్లేపల్లి లో ఈయొక్క ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం చాలా గర్వకారణంగా ఉందని ,ఈ యొక్క క్యాంప్ కి అన్ని విధాల సహకరించిన యుగేందర్ రెడ్డికి ధన్యవాదాలు అని, అడగగానే క్యాంపు కొండమల్లేపల్లిలోనే నిర్వహించాలని, ముందుకు వచ్చి, దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ బ్యానర్ మీద చేయాలని సభ్యులను ప్రోత్సహించిన, యుగేందర్ రెడ్డి కి అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని, అలాగే ఇంకా ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు కొండమల్లేపల్లి లో కూడా చేపడతామని, ఈ సందర్భంగా వారు అన్నారు ,దాదాపు 200 మంది వరకు ఈ యొక్క క్యాంపులో చెకప్ చేయించుకోవడం జరిగిందని, వారికి ఉచిత టెస్టులు చేయడం జరిగిందని ,ఈ సందర్భంగా వారు అన్నారు ,ఈ యొక్క క్యాంపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని, అలాగే పిలవగానే ఉచిత సేవ చేయడానికి విచ్చేసిన మా యొక్క డాక్టర్స్ ,Dr నికిత MS జనరల్ సర్జన్,Dr స్వప్న DGO గైనకాలజిస్ట్ ,Dr మనో చరణ్ MS జనరల్ సర్జన్, Dr తీర్థారాణి MD జనరల్ మెడిసిన్, వీరికి మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని ఈ సందర్భంగా వారు అన్నారు, ఈ కార్యక్రమంలో BRS ప్రధాన కార్యదర్శి యుగేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, లీగల్ అడ్వైజర్ ఉమా మహేష్ , రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, మాజీ ఎంపిపి మేకల శ్రీనివాస్ యాదవ్, మాడ్గుల యాదగిరి, మైనంపల్లి వెంకట్ రెడ్డి , వస్కుల కాశయ్య, అబ్బనబోయిన శ్రీనివాస్ యాదవ్, దస్రు నాయక్, తాళ్ల సురేష్,. డాన్స్ మాస్టర్ క్రాంతి, రాక్ స్టార్ రమేష్, కరాటే మాస్టర్ శ్రీను, డాన్స్ మాస్టర్ జగన్, భీమ్ సింగ్ రాము ,సాయి, శివ ,కృష్ణ, ఆంజనేయులు, కాజా ,శ్రీను, మెడికల్ సిబ్బంది లక్ష్మయ్య, అనుష, జ్యోతి, మధు ,మార్కెట్ ఆఫీస్ సిబ్బంది, బిక్షం, వెంకటయ్య, మల్లమ్మ ,రాములమ్మ, సురేందర్, క్రీడాకారులు కళాకారులు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు