జనం సాక్షి, గీసుగోండగీసుగొండ మండలంలోని ధర్మారం గ్రామం లో ని మెయిన్ సెంటర్ లో శ్రీశ్రీశ్రీ కవయిత్రి మొల్లమాంబ విగ్రహ ఆవిష్కరణ చేసిన తొలి ఎంబిసి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూతొలి కవయిత్రిమొల్లమాంబ జీవిత సారాంశాన్ని, ఆమె, విలువలతో కూడిన రచనలు చేసిన వివరాలను, కుమ్మరి సోదరుల ఐకమత్యమ్ తో ముందుకు పోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుమ్మరి బాలకృష్ణ ప్రజాపతి, తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు రుద్రారపు కుమారస్వామి ప్రజాపతి లతో పాటు వివిధ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, మండల స్థాయి నాయకులు,కుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.




