కేసాని లింగారెడ్డి జన్మదిన వేడుకలు కొండమల్లేపల్లి ఫిబ్రవరి 7 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలో మంగళవారం నాడు కొండమల్లేపల్లి బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కేసాని లింగారెడ్డి మరియు పాత్రికేయుడు బూడిద శ్రీనివాస్ యాదవ్ ల జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసాని లింగారెడ్డి కొండమల్లేపల్లి మండల అభివృద్ధికి చాలా కృషి చేశారని కొండమల్లేపల్లి పట్టణంతో పాటు పరిసర గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ ను బలోపేతం చేశారని ఎన్నికలలో ఎంతో కష్టపడి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించారని వారు పార్టీకి చేసిన సేవలను కొనియాడారు మంచికి మారుపేరుగా, ప్రజలందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఎలాంటి రాజీ లేకుండా ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని తెలిపారు రైతు సోదరులు, స్నేహశీలి, నిరాడంబరులు, వివాదరహితులు, సౌమ్యులు రైతుబంధు సమన్వయ సమితి మండల అధ్యక్షులు కేసాని లింగారెడ్డికి పార్టీలకు అతీతంగా పట్టణ ప్రజలు వ్యాపారస్తులు వివిధ సంఘాల ముఖ్య నాయకులు, వివిధ శాఖల అధికారులు, పోలీసులు, పత్రికా సోదరులు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ ప్రజాక్షేత్రంలో ప్రజలకు వారి విలువైన సేవలు అందించాలని ఆశిస్తూ మండల ప్రజలందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మరియు పాత్రికేయుడు, యువకుడు, విద్యావంతుడు, చురుకైన స్నేహభావం కలిగిన సోదరుడు బూడిద శ్రీనివాస్ యాదవ్ కు పార్టీలకు అతీతంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొండమల్లేపల్లి పాలసీతరీకరణ కేంద్రం మేనేజర్ సత్యం, సూపర్వైజర్ వెంకట్ రెడ్డి, కొండమల్లేపల్లి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ గంధం సురేష్, ఎంపీటీసీ వస్కుల కాశయ్య, మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, గుమ్మడవల్లి సర్పంచ్ గుండెబోయిన లింగం యాదవ్, మాజీ సర్పంచులు మాడ్గుల యాదగిరి, అబ్బనబోయిన శ్రీనివాస్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రావుల వెంకటయ్య యాదవ్,రావుల సత్యనారాయణ యాదవ్, అలుగుల సైదిరెడ్డి,బావండ్ల దుర్గయ్య, ఆర్టీసీ వెంకట్ రెడ్డి, ఖాజా మొహినుద్దీన్,బోడ అశోక్ యాదవ్, రమావత్ శివ, సిద్ధూ, నగేష్ సలాం బిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపిటిసిలు, వార్డ్ మెంబర్లు, మిత్రులు, శ్రేయోభిలాషులు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు




