Tuesday, 3 November 2026

ఆకలితో నిరీక్షించవద్దన్నదే మా ఆలోచన

 

–

 

 

 

 

 

 

సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే వారికి అన్నదానం- ఇక నుంచి రాజగృహా నుంచే మధ్యాహ్న బోజనం సరఫరా
– నిత్య భోజనశాలను ప్రారంభించిన జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్జనం సాక్షి, మంథని : తన ఇంటికి వచ్చే వారు ఎవరూ ఆకలితో ఉండకూడదని, తమ కోసం ఆకలితో నిరీక్షించకుండా వారికి బోజనం అందించాలన్నదే మా ఆలోచన అని బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్ గారు అన్నారు. మంథని పట్టణంలోని రాజగృహాలో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిత్య భోజన శాలను మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ గారితో కలిసి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్ ప్రారంబించారు. ఈ సందర్బంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. గతంలో ఇక్కడి పాలకులను కలిసేందుకు వచ్చే పేదలు గంటల తరబడి నాయకుల కోసం నిరీక్షించాల్సిన దుస్థితి ఉండేదని, నాయకుల కోసం తిండీ తిప్పలు లేకుండా ఎదురుచూసేవారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని సుధూర ప్రాంతాల నుంచి ఎంతో మంది పేదలు గత పాలకులను కలిసేందుకు వచ్చి ఆకలితో అవస్థలు పడేవారని, అలాంటి పరిస్థితులు ఇక ఉండకూడదని ఆనాడు ఎమ్మెల్యేగా అయిన వెంటనే తన నివాసంలో బోజన వసతి కల్పించడం జరిగిందన్నారు. ఈనాడు సైతం తనను కలిసేందుకు వచ్చే ఎవరు కూడా ఆకలితీతో నిరీక్షించ వద్దని, ఆకలి తెలిసిన బిడ్డగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుచెప్పారు. పుట్ట లింగమ్మ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రి, జూనియర్‌ కళాశాలల్లోని విద్యార్ధులకు అందించే మధ్యాహ్న బోజనం ఇకనుంచి రాజగృహా నుంచే సరఫరా చేస్తామన్నారు. ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చడం, పేదవర్గాలకు అన్నదానం చేయడంలోనే ఎంతో ఆత్మసంతృప్తి ఉంటుందని ఆయన అన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే పేద బిడ్డలతో పాటు రాజగృహాకు వచ్చే వారికి పుట్ట లింగమ్మ ట్రస్టుద్వారా మద్యాహ్నబోజనం అందించడం జరుగుతుందని ఆయన వివరించారు. పేద వర్గాలకు సేవ చేయడాన్ని తప్పు పడుతూ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు.