Monday, 2 November 2026

కొండమల్లేపల్లి మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి

కొండమల్లేపల్లి మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి కొండమల్లేపల్లి డిసెంబర్ 31 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండల, పరిసర ప్రాంత ప్రజలకు, రైతు సోదరులకు ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన మండలంలో కొత్త ఏడాదిలో ఉన్న కష్టాలను అధిగమించి అకుంఠిత దీక్షతో ప్రజలకు సుపరిపాలన అందిస్తామని స్పష్టం చేశారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని తెలియజేశారు అన్ని వర్గాల ప్రజల ఆశలు అభ్యున్నతే లక్ష్యంగా కొత్త ఏడాదిలో ప్రజల ఆశలు మరియు ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు నూతన సంవత్సరంలో కరోనా మహమ్మారి నుంచి ప్రజలు విముక్తి అయి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు కొత్త ఆకాంక్షలతో ఉత్సాహంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, కుటుంబ సభ్యులందరితో ఆనందంగా ఉండేలా భగవంతుడిని ప్రార్థించామని ప్రజలు కోరుకున్న ప్రయత్నాలు ఫలించాలని ఆకాంక్షించారు గత జ్ఞాపకాలను నెమరువేస్తూ కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ నూతన అభ్యుదయాన్ని ఆకాంక్షిస్తూ రాబోతున్న కొత్త సంవత్సరం మధుర క్షణాలు ఎన్నో అందించాలని ఆశిస్తూ సమస్త ప్రజానీకానికి యువతకు ప్రజా ప్రతినిధులకు పార్టీ శ్రేణులకు అధికారులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారని ఒక ప్రకటనలో తెలిపారు