కొండమల్లేపల్లి మండల ప్రజలకు ప్రజాప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జడ్పిటిసి సలహాదారు పసునూరు యుగేందర్ రెడ్డి కొండమల్లేపల్లి డిసెంబర్ 31 జనం సాక్షి న్యూస్: కొండమల్లేపల్లి మండల మరియు పరిసర ప్రాంత ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు రైతు సోదరులకు, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు జడ్పిటిసి సలహాదారు పసునూరు యుగేందర్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాలలో సంతోషాన్ని వెలుగును నింపాలని 2023 కొత్త సంవత్సరంలో మీ అందరికీ శుభములే కలగాలని ఆకాంక్షిస్తూ పాత సంవత్సరంలొ జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుని తిరిగి కొత్త ఏడాది మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మీరు అనుకున్న లక్ష్యాలను నెరవేరాలని ఆకాంక్షిస్తూ ఉప్పొంగిన ఉత్తేజంతో కొత్త సంవత్సరాన్ని స్వాగతిద్దాం, అవధులు లేని ఉత్సహాంతో పండగ చేద్దాం, ఎన్నో ఆశలను మోసుకువస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మధురమైన ప్రతిక్షణం నిలుస్తోంది జీవితాంతం, రాబోయే కొత్త సంవత్సరానికి సుస్వాగతం పలుకుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని తెలిపారు
కొండమల్లేపల్లి మండల ప్రజలకు ప్రజాప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు




