Tuesday, 3 November 2026

రాష్ట్ర ప్రభుత్వం నిధులను మళ్ళిస్తోంది

రాష్ట్ర ప్రభుత్వం నిధులను మళ్ళిస్తోంది. బోథ్ (జనంసాక్షి) ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రం లో బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యం తో కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామాలకే నిధులు విడుదల చేస్తుంటే, గ్రామాలలో అభివృద్ధి జరగకుండా చేసిన పనులకు నిధులు మంజూరు చేయకుండా, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తూ గ్రామాలలో పనులు చేసిన సర్పంచ్ లకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆయా సమావేశాలలో బిఆర్ఎస్ నాయకులు సిగ్గు లేకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదంటూ అసత్య ప్రచారాలు చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని, వీళ్ళు సకాలంలో నిధులు మంజూరు చేయక చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక చాల మంది సర్పంచ్ లు ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారని, కొందరు కూలీ, నాలి పనులు చేసుకుంటున్నారాని అది భరించలేక రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని చూడలేక ఆసిఫాబాద్ జిల్లా లోని వాంకిడి మండలం లో18 మంది సర్పంచ్ లు ఈ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలన్న ఉద్దేశ్యం తో బిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసారని వారిని ఆదర్శంగా తీసుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ లు బిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసి, ఈ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పాలని,సర్పంచ్ లకు అండగా పార్లమెంట్ సభ్యులు సోయం బాపూరావు అండగా ఉంటారని అన్నారు.
ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి కట్ట భూమేష్, మండల్ నాయకులు తూము సూర్యం, నల్ల గంగయ్య లు పాల్గొన్నారు