కొండమల్లేపల్లి ఫిబ్రవరి 7 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి విద్యార్థి సంఘం నాయకుల ఆధ్వర్యంలో జర్నలిస్ట్ బూడిద శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ బూడిద శ్రీనివాస్ యాదవ్ కొండమల్లేపల్లి మండల కేంద్రంలో పత్రికా విలేకరిగా అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి అని, మంచి వ్యక్తిత్వం, సేవాగుణం, ప్రజలందరితో స్నేహపూర్వకంగా మెలిగే వ్యక్తి అని నీతి నిజాయితీకి మారుపేరని, యువకుడు, విద్యావంతుడు, పత్రికా రంగానికే పేరు ప్రతిష్టలు తెచ్చిన వ్యక్తి అని వారు ప్రజలకు అందించే సమాచారం చాలా విలువైందని వారు సమాజానికి చేసిన సేవలను కొనియాడుతూ జర్నలిస్ట్ బూడిద శ్రీనివాస్ యాదవ్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు శక్తిని ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నామని తెలిపారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు శతజయంతి వేడుకలు జరుపుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వారి బాల్యమిత్రుడు జనంసాక్షి రిపోర్టర్ ఖాజా మొహినుద్దీన్, బిఆర్ఎస్ మండల యువజన అధ్యక్షుడు డీజే కొటేష్ నాయక్, ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి సంఘం నాయకులు ఎండి ఖదీర్, రమావత్ సేవా నాయక్, నాగేంద్ర మరియు విద్యార్థి సంఘం నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు




