కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) జూన్ 2 :—. గత 70 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో జరిగిందని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు భాషవోని కొండల్ ముదిరాజ్ స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జవహర్ నగర్ ప్రధాన రహదారి పక్కన ఉన్న బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయం ముందు బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి జాతీయ పతాకతోపాటు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు ఉద్యమాభివందనాలు సమర్పించారు ఈ సందర్భంగా కొండల్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ తొమ్మిది సంవత్సరాల వ్యవధిలోనే రాష్ట్ర ప్రజలకు వినియోగపరమైన ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి వినూత్నమైన రీతిలో ఎవరు ఊహించని తరహాలో దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిన ఘనత కెసిఆర్ కె దక్కిందని నేడు రాష్ట్రాన్నే కాదు భారతదేశాన్ని కూడా అభివృద్ధి పదంలో నడపాల్సిన అవసరం ఎంతో ఉందని భారత రాష్ట్ర సమితితోనే అభివృద్ధి సాధ్యమని దేశ అభివృద్ధి కోసం కేసీఆర్ ముందుకు సాగడం ఎంతో హర్షించదగ్గ విషయమని ఉద్ఘాటించారు ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు
కొండల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం




