Tuesday, 3 November 2026

కొత్త కంట్రోల్‌ సిస్టంను షార్‌కు అందజేసిన ఈసీఐఎల్‌

హైదరాబాద్‌: శాటిలైట్‌లో ద్రవ ఇంధనం నింపేందుకు కొత్త కంట్రోల్‌ సిస్టంను ఈసీఐఎల్‌ తయారుచేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సిస్టం యంత్రం తయారు చేసినట్లు ఈసీఐఎల్‌ తెలిపింది. షార్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌కు ఈసీఐఎల్‌ నూతన యంత్రాన్ని అప్పగించింది. శాటిలైట్‌ ప్రయోగాల్లో ఇకపై పూర్తి స్వదేశీ పరిజ్ఞానం వినియోగించాలని ఈ సందర్భంగా వారు నిర్ణయించుకున్నారు. 2016 నాటికి 7 శాటిలైట్లను కక్ష్యలో ఉంచనున్నామని, జులై నాటికి 4 పీఎస్‌ఎల్‌వీ, ఒక జీఎస్‌ఎల్‌వీ, జూన్‌లో యూకేకు చెందిన 3 శాటిలైట్లు ప్రయోగించనున్నట్లు ప్రసాద్‌ తెలిపారు. రూ.700కోట్ల షార్‌ బడ్జెట్‌లో రూ.100కోట్లు విదేశాలకే చెల్లిస్తున్నామని, విదేశాలకు చెల్లించేదాన్ని క్రమంగా తగ్గించేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *