రాష్ట్రంలో ప్రజల వద్దకు ప్రభు త్వ పాలన అందించేందుకు మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు, కొత్త మండలాల్లో ప్రజలకు పూర్తి స్థాయి పాలన అందక ఇబ్బందులు పడుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించినా జిల్లాలు, మండలా ల ఏర్పాటు అయిన తర్వాత పాలనపై దృష్టి పెట్టకపోవడంతో కలె క్టరేట్లు, తహశీల్ కార్యాలయాలకు వెళ్లే ప్రజలకు మేలు జరగడం లేదు. జిల్లాల పునర్విభజనలో భాగంగా కలెక్టరేట్‌లు, తహశీల్ కార్యాలయాల్లో పూర్తి సమాచారం లేకుండా పోయింది. ఈ నేప థ్యంలో ఫైళ్లు గల్లంతుకావడం… రికార్డులు అందుబాటులో లేక పోవడంతో అధికారులకు సమస్యగా మారింది. కొన్ని జిల్లాలను రాత్రికి రాత్రి ఏర్పాటు చేస్తూ ప్రకటన రావడం, పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులకు సమాచారం లేకపోవడంతో గణాంకాలు సరిగా లేకుండా పోయాయి.రాష్టప్రభ్రుత్వం గత నెల దసరా పండుగరోజున కొత్త జిల్లాలను ప్రకటించడం, ఆ తర్వాత జిల్లాలు ఏర్పాటై 25రోజులు గడుస్తున్నా ఫైళ్ల సమాచారం పూర్తిస్థాయిలో అందుబాటులో లేదు.
కొత్త జిల్లాలతో కొత్త సమస్యలు




