స్థల సేకరణకొత్త పంచాయతీ కొత్త పనులకు శ్రీకారం అంబేద్కర్ విగ్రహం కమిటీ హాల్ భవన నిర్మాణానికి నూతన గ్రామ పంచాయతీకి స్థల సేకరణవజినేపల్లి గ్రామ సర్పంచ్ గోక స్వర్ణలత- సదానందం
మహా ముత్తారం ఫిబ్రవరి 01( జనం సాక్షి) మండలంలో పాత గ్రామ పంచాయతీలు 12 ఉండగా తెలంగాణ ప్రభుత్వం మరొక 12 కొత్త గ్రామపంచాయతీలు చేసిన విషయం తెలిసిందే, నూతనంగా ఏర్పడ్డ వజినేపల్లి గ్రామపంచాయతీ లో సర్పంచ్ గోక స్వర్ణలత- సదానందం కొత్త పంచాయతీకి కొత్త పనులు శ్రీకారం చుట్టారు. డ ఎన్ఆర్జిఎస్ పథకం కింద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం మరియు కమిటీ హాల్ నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి స్థలం సేకరణ వేగవంతం చేసి సంబంధిత రెవెన్యూ అధికారులు ఆర్ ఐ శ్రీనివాస్, సర్వేర్ రమేష్ స్థలాన్ని సేకరించి కొలతలను తీసుకొని అద్దులు పెట్టించి స్థలం సేకరణ చేశారు. బుధవారం స్థల సేకరణ అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి గ్రామ ప్రజలందరూ తోడ్పడి సహకరించాలని వారు తెలిపారు. గ్రామ అభివృద్ధికి అడ్డంకులు వేస్తే వారు చేసేది ఏమీ లేదని మంచికి మంచి చెడుకు చెడు అంతు చిక్కని సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటామని అన్నారు. మన మండలంలో ఎవరు చేయని పని ఒకటి చేయాలని ఆలోచనతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఓటు హక్కుతో మొట్టమొదటిగా మా గ్రామానికి సర్పంచ్ కావడం గర్వంగా భావిస్తూనా అంబేద్కర్ విగ్రహం మరియు కమిటీ హాల్ సాంక్షన్ కావడంతో సంతోషకరమని అన్నారు.పదవి కాలం ఒక సంవత్సరం ఉండగా నూతన గ్రామపంచాయతీ కార్యాలయం మరియు అంబేద్కర్ విగ్రహం కమిటీ హాల్ నిర్మాణం ఏర్పాటు చేసి ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందని దీనికి గ్రామ ప్రజలంతా సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. అలాగే మన ఊరు మన బడిలో మన ప్రాథమిక పాఠశాలలో చుట్టూ కాంపౌండ్ వాల్, పాఠశాల భవనానికి కొత్తగా పెయింటింగ్ ఏ చిన్న పనై




