Thursday, 5 November 2026

కొత్త మండలం అన్ని రంగాల్లో ముందుంది

తూప్రాన్ జూన్ 10( జనం సాక్షి )::: మనోహరాబాద్ మండలం కొత్తగా ఏర్పాటు అయినప్పటి నుంచి నాలుగు సంవత్సరాలలో మనోహరాబాద్ మండలంలో 17 గ్రామాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం పథకాలను అమలులో ఆదర్శంగా నిలిచిందని మనోహరాబాద్ ఎంపీపీ పురం నవనీత రవి పేర్కొన్నారు దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నూతనంగా ఏర్పడిన మండలంలో మండల పరిషత్ నుంచి 96 లక్షల రూపాయల వివిధ గ్రామాల ద్వారా నిధులు వచ్చాయని వాటిని గ్రామాల అభివృద్ధికి వినియోగించినట్లు తెలిపారు 17 గ్రామ పంచాయతీలలో గ్రామపంచాయతీ భవనాల నిర్మాణము గ్రామ నర్సరీలు వైకుంఠధామాలు క్రీడా ప్రాంగణాలు సిమెంట్ రోడ్లు మృతకాలం నిర్మాణం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ అనగా నిర్మాణాలు వంటి కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించామని ఆమె తెలిపారు కొత్తగా మండలం ఏర్పాటు వల్ల ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులో ఉంటాయని దగ్గరగా ఉండడం తోటి పనుల నిర్వహణ భారం తగ్గుతుందని తెలిపారు పల్లె నర్సరీ ద్వారా ప్రతి సంవత్సరం రెండు లక్షల మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాయని ఆమె తెలిపారు ఉత్సవాల్లో భాగంగ కొత్త మండలం గౌరవ ముఖ్యమంత్రివర్యులు ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మండల ప్రజలకు పాలన వ్యవస్థ అందుబాటులో ఉంచడం ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు చిగురాయ్ అన్నారు మండల కాంప్లెక్స్ భవనం నిర్మాణంలో ఉందని అది అందుబాటులోకి త్వరలో రానుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ విటల్ రెడ్డి, ఎంపీడీవో యాదగిరి రెడ్డి, ఎంపీ ఓ లక్ష్మీ నర్సింహులు, సూపర్డెంట్ కృష్ణమూర్తి, కోఆప్షన్ సభ్యులు మునావర్, మరియు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.