Thursday, 5 November 2026

వికలాంగుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్

వరంగల్ బ్యూరో, జూన్ 10 (జనం సాక్షి) వికలాంగుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని నవతెలంగాణ వికలాంగుల ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఎండి  అజీమ్ అన్నారు.దివ్యాంగుల  పెన్షన్ ను రూ .3016 నుండి రూ.4016 లు పెంచినందుకు గాను హర్షం వ్యక్తం చేస్తూ శనివారం వరంగల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే నరేందర్ ల చిత్రపటాలకు జిల్లా  వికలాంగుల కమిటీ తరపున పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా అజీమ్ మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు పెద్దపీట వేస్తూ వారి సంక్షేమానికి పాటు పడుతుందని, దివ్యాంగులకు ఆర్థిక తోడ్పాటు ను అందించడానికి రూ.3016 ఉన్న పెన్షన్ ను రూ.4016 పెంచడం  జరిగిందని ఇది ఆహ్వానించదగ్గ పరిణామం అని  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణపడి ఉంటామని సందర్భంగా ఆయన తెలిపారు.ఇట్టి కార్యక్రమం లో వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి రాజేందర్, గై సతీష్, బత్తిని రాజు, పాకాల మనోహర్,అడ్లూరి వాణి, అబ్దుల్ షబ్బీర్, సునీత,పెద్దన్న, నీలం రాజు,ఎస్.డి అసద్, తదితరులు పాల్గొన్నారు.