– యువ ఎమ్మెల్యేల వైపే కేసీఆర్ చూపు
– పాత మంత్రుల్లో కొందరికే చాన్స్ దక్కే అవకాశం
– ఈటెల, తలసాని, జగదీశ్వర్‌రెడ్డి, జోగురామన్నలకు?
– నాయిని, పద్మారావు, ఇంద్రకరణ్‌రెడ్డి, లక్ష్మారెడ్డికి డౌటే?
– కేబినెట్లో హరీష్‌రావు, కేటీఆర్‌లకు అవకాశంపై సస్పెన్ష్
– మిగిలిన వారంతా కొత్తవారే
– ఖమ్మం జిల్లా నుంచి ఎవరనేదానిపై చర్చ
హైదరాబాద్, ఫిబ్రవరి15(జనంసాక్షి): ఈనెల 19న కేసీఆర్ కేబినెట్ విస్తరణ చేయబోతుండటంతో మంత్రి వర్గ కూర్పుపై అంరదిలోని ఆసక్తి నెలకొంది. మంత్రి వర్గంలో ఎవరికి అవకాశం ఇస్తారు.. ఎంత మందిని తీసుకుంటారనే చర్చ సాగుతుంది. ముఖ్యంగా ఈ దఫా 10 నుంచి 15మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలుపేర్కొంటున్నాయి. వీరిలో పాతవారి కంటే కొత్తవారికే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేందుకుకేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతుంది. మరోవైపు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కేటీఆర్, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌రావులకు కూడా ఈ దఫా మంత్రి వర్గంలో అవకాశం దక్కే చాన్స్ తక్కేవనని తెలుస్తోంది. మంత్రి వర్గం విస్తరణలో ఈటెల, తలసాని, జగదీశ్వర్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, రేఖానాయక్, జోగురామన్న, కొప్పుల ఈశ్వర్‌కు అవకాశం దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకుంటే..
ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణ జరిపే అవకాశాలున్నాయి. నల్గొండ జిల్లా నుంచి జగదీశ్వర్ రెడ్డి గత కేబినెట్‌లో విద్యుత్‌శాఖ మంత్రిగా పనిచేశారు. ఈసారి కూడా ఆయనకు కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికితో అదే జిల్లా నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డిని
కూడా కేబినెట్‌లోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఈయనకు ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవికి అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహబూబ్‌నగర్ జిల్లా నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన లక్ష్మారెడ్డి ఈ దఫా కేబినెట్‌లో అవకాశం దక్కే చాన్స్ కొంతమేరే కనిపిస్తున్నట్లు సమాచారం. గతంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలు మంత్రి వర్గంలో కొనసాగారు. జూపల్లి కృష్ణారావు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలవ్వగా.. లక్ష్మారెడ్డి గెలుపొందారు. అయితే లక్ష్మారెడ్డి మరోసారి అవకాశం వస్తుందని అందరూ భావిస్తున్నప్పటికీ కేసీఆర్ మాత్రం లక్ష్మారెడ్డి స్థానంలో రెడ్డిసామాజికవ ర్గం నుంచి వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్‌రెడ్డిని కేబినెట్లోకి తీసుకొనేందుకు సముఖంగా ఉన్నట్లు సమాచారం. నిరంజన్‌రెడ్డి 2014 ఎన్నికల్లో చిన్నారెడ్డిపై ఓటమిపాలయ్యాడు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో అదే చిన్నారెడ్డిపై గెలుపొందారు. నిరంజన్‌రెడ్డి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో పాటు ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌కు వెన్నంటే ఉన్నారు. దీంతో మహబూబ్‌నగర్ నుంచి నిరంజన్‌రెడ్డి బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు బీసీ సామాజిక వర్గం నుంచి మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌కు అవకాశం కల్పించేందుకు కేసీఆర్ సుమఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాల సంఘాల తరుపున కీలక భూమిక పోషించిన వ్యక్తిగా శ్రీనివాసగౌడ్‌కు మంచి పేరుంది. గతంలో ఆయనకు మంత్రి వర్గంలో అవకాశం దక్కుతుందని భావించినప్పటికీ అలా జరగలేదు. కాగా ఈదఫా మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రెండో మంత్రిగా శ్రీనివాస్‌గౌడ్‌కు ఈ దపా బెర్త్ ఖాయమని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. మెదక్ జిల్లా నుంచి ఎవరు కేబినెట్‌లో ఉంటారని ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఉమ్మడి మెదక్ నుంచి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండటంతో పాటు సిద్ధిపేట ఎమ్మెల్యేగా హరీష్‌రావు ఉన్నారు. కానీ ఈ దఫా కేబినెట్‌లో హరీష్‌రావుకు అవకాశం ఉండదని చర్చ సాగుతోంది. హరీష్‌రావు కాకుంటే మెదక్ నుంచి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డిపేరు వినిపిస్తుంది. మహిళా కోటాలో పద్మాదేవేందర్‌రెడ్డి పేరు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఇదే జిల్లా నుంచి రామలింగారెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. రామలింగారెడ్డి ఉద్యమ నేతగా ఉన్నారు. కేసీఆర్ సన్నిహిత వ్యక్తి.. ఈ జిల్లాకు సంబంధించి హరీష్‌రావుకు ఇవ్వకుంటే పద్మాదేవేందర్ రెడ్డి లేదా రామలింగారెడ్డికి అవకాశం దక్కే చాన్స్ కనిపిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గతంలో కేటీఆర్ మంత్రివర్గంలో ఉన్నారు. ఈసారి ఆయన మంత్రి వర్గంలో ఉంటారా లేదా అనేది స్పష్టత లేదు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి కేటీఆర్‌కు అవకాశం లేనట్లు ప్రచారం జరుగుతుంది. కేటీఆర్ ఇవ్వకుంటే మరెవరికి ఇస్తారనేది చర్చనీయాశంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అసలు మంత్రి వర్గంలోకి ఎవరైనా తీసుకుంటారా లేదా అనేది స్పష్టత లేకుండా కనిపిస్తుంది. గతంలో ఈ జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వరరావు రోడ్లు భవనాల శాఖా మంత్రిగా పనిచేశారు. కాగా ఈదఫా ఆయన పాలేరు నుంచి పోటీ చేసి ఓడిపోవటంతో ఆయన స్థానంలో ఖమ్మం జిల్లా నుంచి ఏకైక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన కమ్మ సామాజిక వర్గ నేత పువ్వాడ అజయ్‌కుమార్‌కే అవకాశం ఉంటుంది. కానీ కేసీఆర్‌కు తుమ్మల అత్యంత సన్నిహితుడు కావడంతో పాటు, రాజకీయాల్లో సుధీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిగా తుమ్మలను మరోసారి ఎమ్మెల్సీ కోటా మంత్రి పదవి అప్పగించేందుకు కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఆమేరకు ఆలోచన చేస్తే పువ్వాడ అజయ్‌కుమార్ మంత్రివర్గంలో చాన్స్ కోల్పోయినట్లే అవుతుంది. అది కాకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ నుంచి ఒక్కరే గెలుపొందడంతో ఈ జిల్లాకు అసలు మంత్రి వర్గంలో అవకాశం ఉంటుందా అనే చర్చకూడా సాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి
ప్రధానంగా మంత్రి పదవి కోసం ఐదుగురు పోటీ పడుతున్నారు. గతంలో ఈ జిల్లా నుంచి విద్యాశాఖ మంత్రిగా కడియం శ్రీహరి పనిచేశారు. కాగా ఈ దఫా ఎన్నికల్లో కడియంకు అసెంబ్లీ సీటు ఇవ్వని కేసీఆర్, పార్లమెంట్‌కు పంపేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరికి మంత్రి వర్గంలో అవకాశం లేనట్లే తెలుస్తోంది. మరోవైపు ప్రముఖంగా వినిపించే పేరు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎర్రబెల్లి గత ఎన్నికల్లో మంత్రి కోసం ప్రయత్నాలు చేశారు. వెలమ సామాజిక వర్గంకు చెందిన వ్యక్తి కావడంతోపాటు.. అప్పటికే కేబినెట్లో నలుగురు వరకు వెలములు ఉండటంతో ఎర్రబెల్లికి అవకాశం దక్కలేదు. ఈదఫా ఎర్రబెల్లికి కేబినెట్‌లో కచ్చితంగా స్థానం ఉంటుందని చర్చ సాగుతుంది. మరోవైపు డీఎస్ రెడ్యానాయక్, ఆరూరి రమేష్, ధాస్యం వినయ్ భాస్కర్, డాక్టర్ తాటికొండ రాజయ్యలు మంత్రి వర్గంలో స్థానం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందనే జిల్లాలో చర్చనీయాశంగా మారింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి చూసుకుంటే గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తుతం స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆ జిల్లా నుంచి పలువురు మంత్రి పదవుల కోసం ఆశిస్తున్నారు. మరోవైపు అదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో గతంలో అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్నలు మంత్రి వర్గంలో ఉన్నారు. కాగా ప్రస్తుతం వారిలో జోగురామన్నకే అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తుంది. ఇంద్రకరణ్‌రెడ్డిని పక్కన పెట్టి ఆయన స్థానంలో వేరే వారికి అవకాశం ఇస్తారని సమాచారం. ఈ జిల్లాలో ఖానాపూర్ నియోజకవర్గం మహిళా కోటా రేఖానాయక్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు ఎస్సీ కోటాలో కేసీఆర్ శిష్యుడు బాల్కన్ సుమన్‌కు మంత్రి వర్గంలో చోటు కల్పించడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తానికి ఈ జిల్లా నుంచి ముగ్గురికి మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలుగా ఉన్నవారికి మంత్రి వర్గంలోకి తీసుకుంటారని చర్చసాగుతుంది. మరోవైపు రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే.. ఉమ్మడి జిల్లాలో అరడజను మంది మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. గతంలో ఈ జిల్లా నుంచి మంత్రిగా పనిచేసిన మహేమందర్‌రెడ్డి ఓటమి పాలవటంతో ఆయన తమ్ముడు, కొడంగల్ నుంచి గెలుపొందిన పట్నం నరేందర్‌రెడ్డి మంత్రి వర్గంలో అకవాశం కల్పిస్తారని ప్రచారం సాగుతుంది. మరోవైపు మల్లారెడ్డికి కూడా రంగారెడ్డి జిల్లా నుంచి అవకాశం ఇస్తారని ప్రచారం జరగుతుంది.
కొత్త వారికే అవకాశం!




