Tuesday, 3 November 2026

కొనసాగుతున్న అల్పపీడనం రాష్ట్రంలో భారీ వర్షాలు

విశాఖ: అప్పపీడనం ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా బెంగాల్‌ తీర్మాన్ని ఆనుకుని స్థిరంగా కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కదులుతోంది. నైరుతి రుతుపవనాలు కూడా చరుగ్గా మారడంతో ఉత్తరకోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *